హొమ్ | Language Option | డౌన్ లోడ్స్ | ఎఫ్ ఎ క్యూ | Help Manual | వివరాలకు సంప్రదించండి (కొత్త టోల్ ఫ్రీ నెంబర్‍) | Site Map
 
 
భారతీయ భాషల కోసం సాంకేతిక విజ్ఞానాభివృద్ధి

సమాచారం ఇచ్చి పుచ్చుకునే ప్రక్రియ మానవాళికి వివిధ పద్ధతులలో సంక్రమించింది. వీటిలో ప్రధానమైనవి దృశ్య, శ్రవ్య పద్ధతులు. ప్రస్తుతం మనిషి యాంత్రిక సాధనాలద్వారా సమాచారాన్ని పొందుతున్నాడు. సమాచార మార్పిడి మాత్రం యాంత్రిక సానుకూలత పైనే ఎక్కువగా ఆధారపడి ఉందికాని మనిషి సౌకర్యం పైనకాదు. మౌస్, కీ బోర్డ్ అనేవి ప్రధాన ఇన్‌పుట్ సాధనాలుకాగా దృశ్య ప్రధానమైన మానిటర్ ప్రధాన ఉత్పాదక (లేక) ఔట్ పుట్ పరికరమైంది. ఇలాంటి కంప్యూటర్ ప్రక్రియలను వినియోగించడానికి ప్రత్యేక నైపుణ్యం, మానసిక సంకల్పం అవసరం. అయితే చాలమందికి ఈరకం నైపుణ్యం పొందగలిగే అవకాశం లేదు. అలాంటప్పుడు కంప్యూటరుకు ఉన్న ఈ శక్తిసామర్థ్యాల ద్వారా ప్రజలంతా ప్రయోజనం పొందాలంటే సమాచార మార్పిడిపద్ధతి సమూలంగా మారాలి. యంత్రమే ప్రధాన పాత్ర పోషించే సమాచార వ్యవస్థను మానవ ప్రాబల్యంగల వ్యవస్థగా మనం మార్చాలి. సమాచారాన్ని గ్రహించడంలో దృశ్యపద్ధతి చాలా బలమైన దైనప్పటికి మౌఖిక పద్ధతి కూడా సమాచారం అందజేయడానికి సానుకూలమైనది, అందరూ ఇష్టపడేది కూడా. కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్ల వ్యవస్థలు విస్తృతంగా వ్యాపించిన ఈ రోజుల్లో ప్రజలు మారుమూల ప్రాంతాల సమాచారంకూడా సులభంగా తెలుసుకోగలుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో మాటల ద్వారా, సంభాషణ ద్వారా సమాచారం పంపడం మరింత సానుకూలంగా, పటిష్టంగా రూపొందింది.

ఈ దశలో సమాచారం అందచేయడంలో మౌఖిక పద్ధతికి మరింత ప్రాధాన్యత వచ్చింది. మౌఖిక పద్ధతి ద్వారా సమాచారం అందచేయడానికి సహజభాష అవసరమవుతుంది. ఈ కారణంగానే సమాచార సాంకేతిక విజ్ఞాన వ్యవస్థలో భాషా శాస్త్రం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుచేతనే మానవ ప్రాబల్యంగల కంప్యూటర్ సమాచార వ్యవస్థ ఈ నాడు మనకు అవసరమైంది. భాష అనే సాధనం కేవలం మానవులకే లభించిన అరుదైన అద్భుతవరం. సమాచారాన్ని, భావాలను, అలోచలనలను పరస్పరం సులభంగా పంచుకోడానికి మానవాళికి భాషే సరైన సాధనం. మానవ సహజ భాషను ఉపయోగించి మనిషి-యంత్రం మధ్య పరస్పర సంబంధాన్ని రూపొందించాలంటే మానవ భాషకు సంబంధించిన అనేక అంశాలను అధ్యయనం చేయవలసి ఉంటుంది. మానవ భాష యొక్క సాంకేతిక విజ్ఞానానికి సంబంధించిన అనేక అంశాలకు ప్రాధాన్యం కల్పించడం అవసరం. అవి ప్రసంగాన్ని సంక్షిప్తం చేయడం; ప్రసంగాన్ని, లిపిని గుర్తించి అర్ధం చేసుకోవడం, యంత్రసహాయంతో అనువాదం, ప్రసంగ పాఠాన్ని తయారు చేయడం, సంభాషణా సమన్వయం, గొలుసుకట్టు లిపిని విశ్లేషించడం, అందుకు సంబంధించిన కొన్ని ప్రక్రియలు రూపొందించడం మొదలగునవి. మౌఖిక భాష అయినా, లిఖిత భాష అయినా ఇక్కడ యంత్రంతో తగిన పరస్పర సమన్వయం ఉండడం తప్పనిసరి.
 
కంప్యూటర్ పై భారతీయ భాషలకు సంబంధించిన పనిచేయడం గత రెండు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. డాటా ప్రాసెసింగ్, వర్డ్ ప్రాసెసింగ్, డెస్క్‌టాప్ పబ్లిషింగ్ తదితర ప్రక్రియలుకూడ వేర్వేరు పద్ధతుల్లో రెండు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయి.

సమాచార మార్పిడికి ఉపకరణాలను, మెలకువలను రూపొందించేందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ భారతీయ భాషలకోసం సాంకేతిక విజ్ఞానాభివృద్ధి (టి.డి.ఐ.ఎల్) కార్యక్రమాన్ని ప్రారంభించింది. భాషాపరమైన అడ్డంకులు లేకుండా మనిషి, యంత్రం (కంప్యూటర్) మధ్య పరస్పర సమన్వయాన్ని రూపొందించడం, బహుభాషల విజ్ఞాన వనరులను ఏర్పాటు చేయడం, సృజనాత్మక సమాచార ఉత్పాదనలను, సేవలను రూపొందించడం వంటి లక్ష్యాలతో ఈ కార్యక్రమం ప్రారంభించారు. కార్పోరా, నిఘంటువులు వంటి భాషా శాస్త్రవనరులను అభివృద్ధి చేసే పథకాలకు ఆర్ధిక సహాయం అందించారు. ఫాంట్లు, టెక్‌స్ట్ ఎడిటర్, పదబంధాల పరిశీలనావ్యవస్థ, ఓసిఆర్, టెక్ట్స్ టూ స్పీచ్ వంటి సమాచార ప్రకియ ఉపకరణాలను రూపొందించేందుకు కూడా పథకాలను చేపట్టారు. వాటికి అవసరమైన ఆర్ధిక సహాయం అందించారు. వీటికి సంబంధించిన ప్రమాణాలను కూడా రూపొందించారు.

భారతీయ భాషా సాంకేతిక విజ్ఞాన ఉత్పత్తుల సేవలను రూపొందించడానికి ప్రభుత్వస్థాయిలో, ప్రైవేట్ స్థాయిలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా కృషి జరిగింది. సూచనలు, సలహాలు రూపొందించేందుకు ‘రిసోర్స్ సెంటర్లు’, కాల్ నెట్ సెంటర్లు తయారు చేసిన భాషాపరమైన సాంకేతిక ప్రక్రియలను, ఉపకరణాలను శీఘ్రంగా ఉపయోగంలోకి తీసుకురావలసి ఉంది. అయితే పరిశోధన, అభివృద్ధి, వీటి కృషిప్రభావం సమాజంపై ఎక్కువగా ఉండేట్లు చూడటం అవసరం. అభివృద్ధికృషి ఫలితాలు కేవలం లేబొరేటరీకే పరిమితం కాకూడదు. అవి ప్రజాప్రయోజనానికి విస్తృతంగా ఉపయోగపడాలి. వినియోగదారుల సూచనలు, సలహాలు, అనుభవాలతో ఈ ఫలితాలు భవిష్యత్తులో మరింత పరిపుష్టం కావాలి.

సమాచార మార్పిడికి సంబంధించి వచ్చే సంవత్సరానికిగాను ఈ కింది ఉత్పత్తులను, పరిష్కారాలను అందజేసేందుకు ప్రభుత్వం సార్వజనిక రంగంలో ముందుకువస్తోంది:


అన్ని భారతీయ భాషలలోను ఉచిత ఫాంట్లు (టి.టి.ఎఫ్ మరియు ఓ.టి.ఎఫ్), వర్డ్ ప్రాసెసర్లు, తొలి చర్యగా సార్వజనిక రంగాల్లో ఉచితంగా విడుదల చేయడానికి ప్రాచీనభాష తమిళం, హిందీలకు గాను ప్రజాదరణ పొందిన ట్రూటైప్ ఫాంట్లను ఎంపిక చేశారు. పుస్తక ప్రచురణ పరిశ్రమతో చర్చలు, సంప్రదింపుల అనంతరం ఈ ఎంపిక జరిగింది. విండోస్ 95, విండోస్ 98, విండోస్ ఎన్.టి ప్లాట్‌ఫాం కలిగిన కంప్యూటర్ వ్యవస్థలలో టి.టి.ఎఫ్. ఫాంట్లను విస్తృతంగా వినియోగిస్తున్నారు. విండోస్ 2000/X.P./2003, లినక్స్ ఫ్లాట్ ఫాంల సిస్టమ్స్‌కు ఓపెన్ టైప్ ఫాంట్లు విడుదల చేస్తున్నారు. ఇలాంటి కృషి జరగడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఉన్న వర్డ్ ప్రాసెసర్లుగాని, లేదా కొత్త వర్డ్ ప్రాసెసర్లుగాని ఈ ఫాంట్లను వినియోగించుకోగలవు. దీనివల్ల డాటా ఎంట్రీ కోసం ఇన్‌స్క్రిప్ట్, ఫొనెటిక్, టైప్‌రైటర్ కీబోర్డ్ వ్యవస్థలు కలిగిన సిస్టమ్ లకు మరిన్ని ఫాంట్లు అందుబాటులోకి వస్తాయి.సమాచారాన్ని గ్రహించడం, స్వీకరించడం, కంప్యూటర్ ప్రాసెసింగ్ కు అనువుగా ఉండేలా డిజిటల్ రూపంలోకి మార్చడం వంటి ప్రక్రియలకోసం ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ వ్యవస్థను రూపొందించారు. స్కాన్ చేసిన ఎదైనా చిత్రాన్ని మనకు అనువైన రీతిలో సవరణలుచేసి టెక్‌స్ట్‌గా మార్చుకోవడానికి ఓ.సి.ఆర్. వీలుకలిగిస్తుంది. పుస్తక ప్రచురణ పరిశ్రమకు ఈ సాఫ్ట్ వేర్ పుస్తకాల కొత్త ఎడిషన్లు తీసుకురావడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది.సంభాషణకు సంబంధించిన కంప్యూటర్ ప్రోగ్రామ్, రైల్వే సమాచారం, ఆరోగ్యరక్ష ణ, వ్యవసాయం, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏర్పడిన విపత్కర పరిస్ధితులు, నిర్వహణ, తదితర ప్రజోపయోగ సర్వీసుల్లో ఈ సాఫ్ట్‌వేర్ ఉపయోగకరంగా ఉంటుంది. భారతీయ భాషల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞాన ప్రయోజనాలు ప్రజలకు అనేక విధాలుగా ఉపయోగిస్తాయి. సిస్టమ్ లోని ప్రోగ్రామ్ సంభాషణను గుర్తించే వ్యవస్థద్వారా మానవ కంఠ స్వరాన్ని గుర్తించి దాన్ని టెక్‌స్ట్‌గా మార్చుతుంది.బ్రౌజర్లు, సమాచారం కోసం అన్వేషణ జరిపే సెర్చ్ ఇంజన్లు, ఇ.మెయిల్ వంటి ఇంటర్ నెట్ ఉపకరణాలను భారతీయ భాషలకు అందుబాటులో ఉంచడంవల్ల భారతీయ భాషలలో ఇ.మెయిల్ ద్వారా సందేశాలు, సమాచారం పంపడం సులభతరం అవుతుంది. ఇతర భారతీయ భాషలలో సమాచారాన్వేషణకు సెర్చ్ ఇంజను వీలు కలిగిస్తుంది. ప్రశ్నఏ భారతీయభాషలో వేసినా జవాబు దీనిద్వారా వస్తుంది.భారతీయ భాషలలోను, ఇంగ్లీషులోను పరస్పర అనువాదం చేయగలిగే అన్ లైన్ ఉపకరణాలు: ఇంగ్లీషులో లేదా ఏదైనా ఇతర భారతీయ భాషలో ఉండే విషయాన్ని, సమాచారాన్ని ఎవరైనా తమకు అవసరమైన భాషలోకి అనువదించుకోవడానికి ఈ ఉపకరణం తోడ్పడుతుంది.


ఈ సాఫ్ట్ వేర్ ఉత్పత్తులను, సేవలను, టి.డి.ఐ.ఎల్. సమాచార కేంద్రం ద్వారా ఆన్ లైన్ హెల్ప్ డెస్క్‌లో అందుబాటులో ఉంచుతున్నారు.

భాషా సాంకేతిక విజ్ఞానం, పంపిణీ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం ఒక నియమితకాల కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఈ రంగంలో పరిశోధన, ఉత్పత్తులను, సేవలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ ప్రణాళికను రూపోందించింది. ఇందు కోసం ప్రభుత్వం ఈ క్రింది చర్యలను చేపట్టింది.అభివృద్ధి చెందిన సాంకేతిక ప్రక్రియలను మార్కెట్ లో ప్రవేశపెట్టడం.ఉత్పత్తులను రూపొందించడానికి సాంకేతిక విజ్ఞాన యంత్రాల స్థాయి, ప్రమాణాలను పెంచడం.అవసరాల ప్రాతిపదికగా కొత్త సాంకేతిక ప్రక్రియలను రూపొందించడం.


పై లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఈ క్రింది చర్యలను చేపట్టింది.

1. భారతీయ భాషా సాంకేతిక విజ్ఞాన ప్రక్రియల ఉపకరణాలను టి.డి.ఐ.ఎల్. సమాచార కేంద్రం ద్వారా దశలవారిగా పంపిణీ చేయడం.2. పరిశోధన ద్వారా రూపొందించిన ఉపకరణాలను, ఉత్పత్తులను, సేవలను సమీకరించడం.3. ఈ ఉపకరణాల ఉపయోగానికి సంబంధించిన అవగాహనను విస్తృతం చేయడం, భాషా సాంకేతిక విజ్ఞాన రంగంలో ప్రభుత్వం సాగించే కృషి గురించి అందుబాటులోని ఉపకరణాల ద్వారా ప్రచారం చేయడం.4. ఉపకరణాలు, ఉత్పత్తులను వినియోగదార్లు ఉచితంగా డౌన్ లోడ్ చేసుకొనే వీలు కలిగించడం.5. భాషా సాంకేతిక విజ్ఞాన రంగంలో ప్రభుత్వ, ప్రైవేట్ బాగస్వామ్యాన్ని ప్రొత్సహించడం.6. ప్రత్యేకమైన అప్లికేషన్ రంగాలకు సంబంధించి కొత్త కార్యక్రమాలను ప్రారంభించడం.